పూర్తయిన నయనతార నిశ్చితార్తం..త్వరలోనే పెళ్లి..!!

పూర్తయిన నయనతార నిశ్చితార్తం..త్వరలోనే పెళ్లి..!!

0
91

ఇండస్ట్రీ లో వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందం , అభినయంతో వరుస సినిమా చేస్తూ ఫుల్ బిజీ గా ఉంటుంది నయనతార.. తెలుగులో సైరా సినిమా లో నటిస్తున్న నయన్, తమిళం లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ స్టార్ హీరోల సినిమా లను సైతం తొక్కేస్తుంది.. సినిమాల సంగతి అటుంచితే పర్సనల్ లైఫ్ లో ఈ అమ్మడికి అంత మంచి ట్రాక్ రికార్డు ఏం లేదు.. ఇప్పటికే శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం కొనసాగించి చివరికి విగ్నేష్ శివన్ తో లవ్ లో ఉంది నయన్..

అయితే వీరి రేలేషన్ పెళ్లి దాకా వెళ్లేలానే కనిపిస్తుంది.. దాదాపు మూడేళ్ళుగా వీరిమధ్య ప్రేమ కొనసాగుతుండగా, వరుస సినిమా ఆఫర్స్ ఉండడం వాళ్ళ వీరు పెళ్లి చేసుకోలేదు.. అయితే ఇప్పుడు ఆ టైం వచ్చినట్లుగా నయన్ చెప్తుంది.. అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉండే నయన్ ఈ ఏడాదిలో నిశ్చితార్థం చేసుకుని వచ్చే ఏడాదిలో పెళ్లి కి ఓప్పుకుందట.. పెళ్లి లోపు ఉన్న సినిమాలన్నీ కంప్లీట్ చేయాలని నయన్ భావిస్తోందట..