రాజధాని జిల్లాలో వైసీపీకి కోలుకోలేని షాక్

రాజధాని జిల్లాలో వైసీపీకి కోలుకోలేని షాక్

0
49

గుంటూరు జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట.. 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు దిశగా ఈసారి తెలుగుదేశం పార్టీ ఉంది అని తెలుస్తోంది. సుమారు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ స్ధానాలు గత ఎన్నికల్లో ఇక్కడ వచ్చాయి.. ఈసారి గుంటూరు రాజధానిగా చేయడం ఇక్కడ టీడీపీ అభివృద్ది మంత్రం జపించడంతో జిల్లాలో ప్రజలు అందరూ ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేశారని, అలాగే టీడీపీకి ఓట్లు వేశారు అని తెలుస్తోంది.. దాదాపు 15 సీట్లు ఈసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సాధించే అవకాశం ఉంది అని తెలుస్తోంది.

ఇంటర్నల్ సర్వేలు కూడా ఇదే విషయాన్ని తెలియచేస్తున్నాయి..తాజాగా గుంటూరు సర్వే రిపోర్టులో వైసీపీకి ఇక్కడ రెండుస్దానాలు కూడా రావు అని తేలిందట. అలాగే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలు దారుణంగా ఓటమి పాలు అవుతారు అని, జిల్లాలో వైసీపీని నమ్మిన దాఖలాలు లేవు అని తేల్చి చెప్పిందట సర్వే. ఇక వైసీపీ మాత్రం తాము 10 స్దానాలుపైనే గెలుస్తాము అనే ధీమాతో ఉన్నారు అయితే ఇక్కడ రిజల్ట్ పై సర్వేలు చూసి జనాలు కూడా ఇదే చెబుతున్నారు. టీడీపీ పథకాలు బాగున్నాయి, మరోసారి వారికే అవకాశం ఇచ్చాము అని నేరుగానే చెబుతున్నారు.