Extra Ordinary Man | మరోసారి క్రేజీ టైటిల్‌తో వస్తోన్న యంగ్ హీరో నితిన్!

-

Extra Ordinary Man | టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వినూత్న కథనాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయనకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నితిన్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. మాచర్ల నియోజకవర్గం సినిమా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. దీంతో నితిన్ ఆశలన్నీ తన 32వ సినిమా మీదే పెట్టుకున్నాడు.

- Advertisement -

దీనికి ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ చిత్ర టైటిల్‌ను ఇవాళ(జులై 23) విడుదల చేశారు. ఈ సినిమాకు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man)’ అనే టైటిల్ పెట్టారు. అలాగే డిసెంబర్ 23న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Read Also: ‘భోళా శంకర్’ నుంచి బిగ్ అప్‌డేట్.. మెగాస్టార్ వచ్చేస్తున్నాడు..!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...