నిత్యామీనన్ బ్యాన్.. రాజమౌళి కి తలనొప్పి..!!

నిత్యామీనన్ బ్యాన్.. రాజమౌళి కి తలనొప్పి..!!

0
39

తెలుగులో నటించింది కొన్ని సినిమా లే అయినా నిత్యామీనన్ కి మంచి నటిగా గుర్తింపు వచ్చింది.. ప్రస్తుతం జయలలిత బయోపిక్ లో నటించబోతున్న ఈ ముద్దుగుమ్మపై మలయాళ సినీ ఇండస్ట్రీ గుర్రుగా ఉంది.. ఆమెపై అక్కడి నిర్మాతలు బ్యాన్ విధించారు. అయితే దీనిపై స్పందించిన నిత్య.. అమ్మకు క్యాన్సర్ మూడవ దశలో ఉంది. నిర్మాతలు నన్ను కలవడానికి వచ్చిన టైమ్‌లో ఓ చిత్రం షూటింగ్‌లో ఉన్నాను. సినిమా చేస్తున్నాననే కానీ ఆలోచన అంతా అమ్మ మీదే ఉంది.

నిర్మాతలతో చర్చలు జరపడానికి మూడ్ కూడా లేదు. మనసు ప్రశాంతంగా లేనప్పుడు వారితో ఎలా మాట్లాడగలను అని నిత్య తెలిపింది. నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా అవాస్తవాలు ప్రచారం చేసి బ్యాన్ చేయడం ఎంత వరకు భావ్యం అని ప్రశ్నిస్తోంది నిత్య. మళయాళీ చిత్ర పరిశ్రమలో తన పేరుని తీసేయాలని కుట్ర పన్నుతున్నారని నిత్య తెలిపింది. కానీ నేను ఇలాంటివేవీ పట్టించుకోను. నాపనేదో నేను చేసుకుంటూ వెళతాను అని నిత్య చెప్పుకొచ్చింది. మరి నిర్మాతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. నిత్యను అర్థం చేసుకుని సినిమాల్లో అవకాశాలు ఇస్తారో లేదో.