బాబుకు ధీమా జగన్ కు డైలమా కొత్త టెన్షన్లు

బాబుకు ధీమా జగన్ కు డైలమా కొత్త టెన్షన్లు

0
75

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అధికారంలోకి రాదు అని కేవలం అన్నీ తప్పుడు సర్వేలు అని ఇవన్నీ ప్రచారాలు మినహా పావలా ఉపయోగం లేదు అంటున్నారు తెలుగుదేశం నేతలు. అసలు ఇలాంటి సర్వేలను నమ్ముకుంటే రాజకీయాలు చేయలేము అంటున్నారు. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 100 సర్వేలు అనుకూలంగా వచ్చాయి, టీడీపీకి 3 సర్వేలు అనుకూలంగా వచ్చాయి, కాని తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అందుకే ఇలాంటి సర్వేలను మేము నమ్మం అంటున్నారుతెలుగుదేశం నేతలు.

ముఖ్యంగా జగన్ గెలిస్తే ప్రజలకు ఏమీ కొత్తగా చేయాల్సిందేమి లేదు అని నవరత్నాలు ఆల్రెడీ తాము ఇచ్చాము అని చెబుతున్నారు.. ఇక ప్రజలకు ఈ విషయం తెలిసే తమకు పెద్ద ఎత్తున అర్ధరాత్రి వరకూ క్యూ లైన్లో ఉండి ఓట్లు వేశారు అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు, ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చామని, కేంద్రం ఏమీ సాయం చేయకుండా ఉన్నా, జగన్ కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు ప్రజలకు ఎంతో సేవ చేశారు అని ఆ దీవెనలు కచ్చితంగా ప్రజల మాకు చూపుతారు అని తెలుగుదేశం నేతలు ధీమాగా ఉన్నారు.మరి చూడాలి వీరి ఇద్దరి ప్రచారాలు కూడా పీక్స్ కు చేరాయి ఎన్నికల్లో.. మరి మే 23 న ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.