కాజల్ కి అతనంటే పిచ్చి.. అతనితో ఏదంటే అది..!!

కాజల్ కి అతనంటే పిచ్చి.. అతనితో ఏదంటే అది..!!

0
47

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం చేతిలో పెద్ద గా సినిమాలేమీ లేకపోయినా సోషల్ మీడియా లో మాత్రం హల్చల్ చేస్తుంది.. రోజుకో ఫోటో పోస్ట్ చేస్తూ అభిమానులను ఉర్రుతలూగిస్తుంది. దశాబ్ద కాలం నుంచి తెలుగులో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతు తెలుగులో దాదాపు అగ్రహీరోలందరి సరసనా నటించి ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న `సీత` సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన కాజల్ తనకు నచ్చిన క్రికెటర్ గురించి మాట్లాడింది. `మీకు నచ్చిన ఆటగాడు ఎవరు` అనే ప్రశ్నకు కాజల్ సమాధానమిచ్చింది. `నాకు రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు ఆయనపై క్రష్ ఉండేది. రోహిత్ ఆటతీరు, ప్రవర్తన నన్ను కట్టిపడేసేవి. అతని బ్యాటింగ్ స్కిల్స్ అద్భుతం` అంటూ కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ సరసన `భారతీయుడు-2`లోనూ, `పారిస్ పారిస్‌` సినిమాలోనూ నటిస్తోంది.