Pawan Kalyan |మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల విషెస్‌తో సోషల్ మీడియాలో చెర్రీ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఈ క్రమంలో తాజాగా.. రామ్ చరణ్‌కు పవర్ స్టార్ పవన్(Pawan Kalyan) కల్యాణ్ కూడా విషెస్ చెప్పారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్‌చరణ్‌కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహభావంతో మెలిగే చరణ్ మరెన్నో విజయాలు అందుకొని ఎదగాలి అందరి మన్ననలూ అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన చరణ్‌కి ఉన్న క్రమశిక్షణ వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివి. కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగరవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
Read Also: మహేశ్ బాబు అభిమానులకు నిర్మాత హెచ్చరిక
Follow us on: Google News, Koo, Twitter