కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకల్లో ప్రభాస్ పెళ్లి వార్త ఏమన్నారంటే

కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకల్లో ప్రభాస్ పెళ్లి వార్త ఏమన్నారంటే

0
121

టాలీవుడ్ సీనియర్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి అందరికి ఆలోచన ఉంటుంది.. ఎలాంటి కొత్త వార్త ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వినిపించినా అందులో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తారు.. కాని యంగ్ రెబల్ పెళ్లాడేస్తానంటూనే స్కిప్ కొట్టేస్తున్నాడు. ఈ బాహుబలి పెళ్లి విషయంలో ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆయన సతీమణి శ్యామలాదేవి ఎంతో టెన్షన్ పడుతున్న సంగతి తెలిసిందే.

ఎన్ని సంబంధాలు చూస్తున్నా ప్రభాస్ ఇప్పుడు పెళ్లి వద్దు అంటూనే ఉన్నాడు, అయితే పెళ్లి చేసుకోవాలి అని ప్రభాస్ కు ఉందా, అసలు ఆ కోరిక లేదా అంటే, తను పెళ్లి చేసుకుంటాను కాని అప్పుడే తొందరలేదు అని చెబుతున్నాడు ఈ రాజుగారు…ఇటీవల కృష్ణంరాజు బర్త్ డే వేడుకల్ని ప్రభాస్ అండ్ టీమ్ ఘనంగా జరిపించారు.. రాజుల వంటకాల్ని అతిథులకు రుచి చూపించారు. ఈ పార్టీకి చిరు కూడా అటెండయ్యారట,ఈ సమయంలో చాలా మంది టాలీవుడ్ పెద్దలు కృష్ణంరాజు దంపతులతో ప్రభాస్ కి పెళ్లి చేయండి అని చెప్పారట.

త్వరగా పిల్లను చూసి పెళ్లి చేసేయండమ్మా అని చిరు అంటుంటే ఆ పక్కనే ఉన్న ప్రభాస్ మాత్రం నవ్వేస్తున్నాడు. చేసుకుంటాను సర్ అప్పుడే కంగారు ఎందుకు అని నవ్వి ఊరుకున్నాడట ప్రభాస్ ఇప్పుడు ఈ వార్త ఈ బర్త్ డే ఫోటోలు చూసి చాలా మంది అంటున్నారు, అయితే ఈ సమయంలో ఇంకెప్పుడు చేసుకుంటావు ప్రభాస్ వాళ్లకి నీ పెళ్లి చూడాలి అని కోరిక ఉంది చేసుకో అని అన్నారట అక్కడ పెద్దలు అందరూ. ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి చేసేస్తాం అని చెప్పారట కృష్ణంరాజు దంపతులు.