జగన్ కెబినెట్ లో ఆ ఇద్దరు ఔట్….

జగన్ కెబినెట్ లో ఆ ఇద్దరు ఔట్....

0
34

వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే… దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మండలిని రద్దు చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…ఈనెల 27న కెబినెట్ సమావేశం కానుంది…

ఆ సమావేశంలో మండలి రద్దుపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.. ఒక వేళ మండలి రద్దు చేస్తే వైసీపీకి కూడా కొన్ని ఇబ్బందులు పడవచ్చు ముఖ్యంగా రాజకీయ నిరుద్యోగులను సమాన పరచడం… ఎమ్మెల్సీ హోదాలో వైసీపీ నేతలకు జగన్ తన కెబినెట్ లో తీసుకున్నారు…

ఒకరు పిల్లి శుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ… మండలిని రద్దు చెస్తే వీరిద్దరు మంత్రిపదవులను కోల్పోతారు.. ఇప్పుడు కాకపోయిన ఆరునెలల్లో మంత్రిపదవులను వీడాల్సి ఉంటుంది… పిల్లి శుభాష్ గతంలో మంత్రి పదవి కాదని జగన్ కు అండగా నిలిచారు అందుకే ఆయనను జగన్ తన కెబినెట్ లో కి తీసుకున్నారు… శాసనమండలిని రద్దు చేయాలని పిల్లి మోపిదేవి చెప్పడం ఆసక్తి దాయకం…