ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియో విడుదల

Prabhas ‘Radheshyam’ making video released

0
49

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహేగ్దే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ టీం ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే సెకండ్‌ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ ట్రైలర్ లో… భవిష్యత్తు చెప్పే ఓ జ్యోతిష్కుడిలా ప్రభాస్ కనిపించాడు. అందరి చేతి రాతలు చూస్తూ… వారి భవిష్యత్తును చెప్పే పాత్రలో ఒదిగి పోయాడు ప్రభాస్.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. రాధేశ్యామ్ నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. మరోవైపు ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉండగా..ఆ తరువాత సలార్, స్పిరిట్ వంటి సినిమాలు లైన్ లో పెట్టాడు.

https://youtu.be/xBBnwXQ_1_M