ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన SERP ఉద్యోగ సంఘాల నేతలు

0
32

నిన్న హైదరాబాదులోని రైతుబంధు సమితి ప్రధాన కార్యాలయంలో SERP ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ తరఫున ఎమ్మెల్సీ & రైతు బంధు కమిటీ రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా వారు పల్లా రాజేశ్వర్ రెడ్డికి రెగ్యులరైజ్ అంశంపై లేఖను అందించారు. SERP ఉద్యోగులు 22 సంవత్సరాలుగా మహిళా సంఘాల ద్వారా గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత కొరకు సేవలు అందిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో 48 లక్షల మంది మహిళలు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని స్వరాష్ట్ర సాధనలో తమ వంతు కీలక పాత్ర పోషించారు. అలాగే ఉమ్మడి ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని ఆశ చూపిన కూడా సకల జనుల సమ్మె కాలంలో మధ్యలో సమ్మె విరమించకుండా ఉద్యమంలో పాల్గొన్న తీరును వారు లేఖలో ప్రస్తావించారు. దీన్ని గుర్తించి ఇదివరకే కెసిఆర్ 2018 మేనిఫెస్టోలో, 2019 లో గవర్నర్ ప్రసంగం ద్వారా SERP లోని 4086 మందిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. దీనిని  అమలయ్యేలా తన వంతు సహకారం అందించాలని రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని జేఏసీ తరఫున కోరారు.

ఈ అంశంపై స్పందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టిలో ఈ అంశం ఉందని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం వేతనం పెంపుదలకు చేశారని ఇచ్చిన మాట ప్రకారం మీకు తప్పక న్యాయం చేస్తానని భరోసా కల్పించారు. ఈ అంశం ముఖ్యమంత్రి దృష్టికి సరైన సమయంలో తీసుకెళ్తానని, అదేవిధంగా మన శాఖ మంత్రి ఎర్రబెల్లితో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుతో కూడా మాట్లాడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జేఏసీ నాయకులు కుంట గంగాధర్ రెడ్డి, ఎపూరి నర్సయ్య, జానయ్య పాల్గొన్నారు.

TS SERP-IKP Employees State Union’s JAC