‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ప్రభంజనం..1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ..

0
110

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన కెజిఎఫ్ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ ల సునామి సృష్టించింది. ఈ నెల 14న విడుదలైన కెజిఎఫ్-2 మూవీ రిలీజ్ అయ్యి  పాన్ ఇండియా స్థాయిలో  మంచి పేరు సంపాదించుకుంది.

ఇప్పటికి థియేటర్స్ లో హౌజ్ ఫుల్ అవ్వడంతో..ఈ సినిమా చూడడానికి జనాలు ఎగపడుతున్నారు. మొదటి భాగానికి మించిన వసూళ్లను చిత్రబృందం తమ ఖాతాల్లో వేసుకుంటుంది. 1000 కోట్లను రాబట్టిన మూడో సినిమాగా రికార్డు నెలకొల్పింది. విడుదలైన 15 రోజుల్లో ఈ సినిమా 1000 కోట్లకి పైగా వసూళ్లను సాధించడంతో యాష్ క్రేజ్ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ప్రభంజనం సృష్టించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాకి మూడవ భాగం కూడా ఉండాలని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం  ఉందని చెబుతుండటం అందరిలోనూ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.