ప్రియమణి రీ ఎంట్రీ.. ఆ పాత్రలో అదరగొడుతుందట..!!

ప్రియమణి రీ ఎంట్రీ.. ఆ పాత్రలో అదరగొడుతుందట..!!

0
93

తెలుగులో మంచి మంచి సినిమా లు చేసినా ప్రియమణి కి సరైన పేరు రాలేదని చెప్పాలి.. పెళ్ళైన కొత్త లో సినిమా లో మొదలైన ఆమె టాలీవుడ్ ప్రయాణంలో యమదొంగ లాంటి సూపర్ హిట్ దక్కినా ఆమెకు అవకాశాలు రాలేదంటే ఆమె బాడ్ లక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. కొత్త కథానాయికల పోటీ కారణంగా అవకాశాలు తగ్గుతూ రావడంతో, సినిమాలకి ఆమె దూరమయ్యారు.

ఇప్పుడు రానా సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తాజా సమాచారం.వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ఒక భారీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి ‘విరాటపర్వం 1992’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఈ టైటిల్ నే ఖరారు చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటించనుండగా, ఒక కీలకమైన పాత్ర కోసం ‘టబు’ను తీసుకున్నారు. ఇక మరో ముఖ్యమైన పాత్రకి గాను ప్రియమణిని తీసుకున్నారట. ఆమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ప్రియమణికి వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.