జగన్ వద్దకు కీలకమైన ఫైళ్లు వాట్ నెక్ట్స్

జగన్ వద్దకు కీలకమైన ఫైళ్లు వాట్ నెక్ట్స్

0
32

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది అని సర్వేలు చెబుతున్నాయి. దీంతో కొందరు నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ అవ్వాలి అని చూస్తున్నారు.. అలాగే కేంద్ర సర్వీసుల్లోకి కొందరు ఉద్యోగులు కూడా వెళ్లాలి అని బీజీగా ఉన్నారు.. ఈ సమయంలో కొందరు అధికారులు వైయస్ జగన్ కు మరింత దగ్గర అవుతున్నారట.. దీనికి కారణాల కూడా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో కొందరు మంత్రులు ప్రాజెక్టుల విలువలను అంచలనాలను పెంచి కమీషన్లు దండుకున్నారు అనే విమర్శలు విజయసాయిరెడ్డి కూడా చేస్తూనే ఉన్నారు.

ఇటీవల కొందరు అధికారులు దీనిపై మాకు రిపోర్టులు ఇచ్చారు అని చెప్పారు.దీంతో ఇప్పుడు టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైంది. ఏ అధికారులు ఏమి ఫైల్స్ తీసుకుని జగన్ వద్దకు వెళ్లారు అని టెన్షన్ వస్తోంది. అయితే ఇప్పడు ఇదే పెద్ద చర్చ జరుగుతున్న విషయం. ముఖ్యంగా జగన్ ఈ ఫైల్స్ అన్ని డేటా ఆధారంగా వాటి గురించి ఎంక్వైరీ వేయిస్తే, తమ జీవితం ఇక అంతే అనే టెన్షన్ లో ఉన్నారట నేతలు. మరి జగన్ వీటితో ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి.