సగం మంది టీడీపీలో అవుట్

సగం మంది టీడీపీలో అవుట్

0
59

తెలుగుదేశం పార్టీ తరపున ఈసారి ఎన్నికల్లో నిలబడిన అభ్యర్దులకు ఇది దారుణమైన అగ్ని పరీక్ష అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఎలాంటి సర్వేలు వస్తున్నా అన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.. అంటే సగానికి సగం వైసీపీ కచ్చితంగా గెలుపొందుతుంది అని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమయంలో బాబు పార్టీ తరపున సీనియర్లు 35 మందికి మాత్రమే సీట్లు ఇచ్చారు. అయితే వారు కూడా సగం మంది ఓటమి రుచిచూస్తారా అనే అనుమానం కూడా కలుగుతోంది.

ముఖ్యంగా వైసీపీ తరపున ఈసారి గత ఎన్నికల్లో ఎవరు ఓడిపోయారో వారికి 50 మందికి జగన్ సీట్లు ఇచ్చారు.. ఇలా కొత్త స్ట్రాటజీ కూడా చూపించారు.. అయితే బాబుమాత్రం సిట్టింగులనే కొన్ని స్ధానాల్లో నిలబెట్టారు.. వారిపై ఉన్న ప్రజా వ్యతిరేకత వైసీపీకి కలిసి వస్తుంది అని జగన్ భావిస్తున్నారు.. ఇదే సర్వేలలో కూడా తెలుస్తోంది, ముఖ్యంగా జగన్ కు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సీనియర్లు 25 మంది ఈసారి ఇంటికి వెళతారు అని తేలిందట.. అంటే సీనియర్లకు సగం మందికి ఓటమి అని తెలియడంతో, తెలుగుదేశం పార్టీ సగం ఖాళీ అవుతుంది అని అంటున్నారు వైసీపీ నేతలు.