ఓ వైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో జక్కన్న తెరకెక్కించిన సినిమా ‘RRR’ మరోవైపు. ఈ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ మార్చి 11న విడుదల కానుంది. RRR మార్చి 25న థియేటర్లలో సందడి చేయనుంది.
మార్చి 11న విడుదల కానున్న రాధేశ్యామ్ అమెరికాలో గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 10న రికార్డు స్థాయిలో ప్రీమియర్ షోలు ప్రదర్శన కానున్నాయి. 1,116 లోకేషన్లలో 11,116 షోలు వేయనున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో అవుతున్నట్లు తెలిసింది. కాగా ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా విడుదలకు ముందే పలు రికార్డులను అందుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన 10 గంటల్లోనే దాదాపు 5 లక్షల డాలర్లను(హాఫ్ మిలియన్) సంపాదించింది. లండన్లో ఒడియన్ బీఎఫ్ఐ ఐమాక్స్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శనకానుంది.
యూకేలోనే ఇది అతి పెద్ద ఐమ్యాక్స్ థియేటర్ అవ్వడం విశేషం. కాగా, ఈ తెరపై ప్రదర్శనకానున్న తొలి భారతీయ చిత్రం కూడా ఇదే. యూకేలో దాదాపు 1000 స్క్రీన్లపై ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కానున్నట్లు తెలిసింది. ఈ మూవీలో రామ్చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ దేవగణ్, ఆలియా భట్, శ్రియ కీలక పాత్రలో నటించారు.