సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తన మార్ఫింగ్ వీడియోపై హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) స్పందించారు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోన్న తన డీప్‌ఫేక్ గురించి మాట్లాడటానికి ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. టెక్నాలజీ తప్పుగా ఉపయోగించడం వల్ల తనతో పాటు ఎంతోమంది భయపడుతున్నారని.. ఈ ఘటన కాలేజీ లేదా స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఊహించలేనని పేర్కొన్నారు. ఒక మహిళగా అందులోనూ నటిగా తనను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు చెప్పారు. ఇలాంటి ఘటనలపై కలసికట్టుగా తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..?
రష్మికకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని రష్మిక(Rashmika Mandanna) లిఫ్ట్‌లోకి వచ్చినట్లు ఆ వీడియోలో ఉంది. దీంతో ఈ వీడియో వైరల్ కాగా.. ఇది ఫేక్ వీడియో అని తేలింది. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్‌కి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియోలో జారా ఫేస్ బదులు రష్మిక ఫేస్ పెట్టి మార్ఫింగ్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తీవ్రంగా స్పందిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Deep fake video of Rashmika Mandanna…
Deepfake technology, which can convincingly manipulate and generate fake audio and video content, poses a significant threat to the spread of misinformation and the erosion of trust in digital media.#deepfake #RashmikaMandanna… pic.twitter.com/rE7hgfuawV— Human Being 🏹 (@ttjktyrt) November 6, 2023