తన మనసులో కోరికను బయటపెట్టిన హీరోయిన్ సాయిపల్లవి

Saipallavi is the heroine who has a word in mind

0
102

తనదైన శైలి నటన, డ్యాన్స్​తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్ల తన మనసులోని కోరికను బయటపెట్టారు. కామెడీ సినిమాలో నటించాలనే కోరిక చాలా రోజులుగా ఉందని తన మనసులో మాటను చెబుతూ..సరైన కామెడీ స్ప్రిప్ట్​ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్​స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో కాస్త బ్రేక్​ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇన్​స్టాలో సరదాగా అభిమానులతో ముచ్చటించారు.

కామెడీ జోనర్​లో ఓ సినిమా చేయాలని ఉంది. అలాంటి పాత్ర చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలి. ప్రాపర్​ కామెడీ స్క్రిప్ట్​ కోసం ఎదురుచూస్తున్నా” అని చెప్పారు. ఇంట్లో ఉన్నప్పుడు, ఖాళీ సమయాల్లో ఏం చేస్తారని మరో నెటిజన్​ అడగగా.. బాగా తిని హాయిగా నిద్రపోతానని తెలిపింది. త్వరలోనే సాయిపల్లవి.. రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నాని ‘శ్యామ్​సింగ్​రాయ్’​ చిత్రంలో నటిస్తోంది.

మరోవైపు కొద్ది రోజుల క్రితం తన అందం విషయంలో భయాలుండేవని చెప్పుకొచ్చింది పల్లవి. నేను చూసిన హీరోయిన్లంతా ఎలాంటి మచ్చలు లేని అందమైన మోమున్న వాళ్లే. నేను వాళ్లలో సెట్‌ అవుతానా..? తెరపై నన్ను చూసి ‘ఈ పిల్ల ఇలా ఉందేంటి?’ అని ప్రేక్షకులంటారేమోనని అనుకునేదాన్ని. ఎవరైనా నన్ను చూస్తే.. నా ముఖంపై ఉన్న మొటిమలు చూసి మాట్లాడతారేమోనని మదన పడేదాన్ని అంటూ చెప్పింది.