హీరోయిన్ సమంతతో విడిపోయిన తర్వాత తొలిసారి ఆమె గురించి హీరో నాగచైతన్య(Naga Chaitanya) స్పందించాడు. తన తాజా చిత్రం ‘కస్టడీ’(Custody) ప్రమోషన్స్‌లో భాగంగా సమంతతో విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము విడిపోయి రెండు సంవత్సరాలు అవుతోందని.. మంచి మనస్సు ఉన్న సమంత(Samantha) ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తెలిపాడు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల వల్లే తమ మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నాడు. ఆ వార్తలతో ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు ప్రజల్లోకి వెళ్లిందన్నాడు. తన గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని తమ మధ్యలోకి లాగి వార్తలు రాయడం బాధించిందని చెప్పాడు. కొంతమంది ఇప్పటికీ వాళ్లు తన పెళ్లి గురించే ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నాడు.
అలాగే ఈ మధ్య కాలంలో అక్కినేని హీరోలకు వస్తోన్న వరుస ప్లాప్స్ పైనా స్పందించాడు. ఎప్పుడూ సక్సెస్ ఫుల్ సినిమాలే చేయాలనుకుంటామని.. కానీ కొన్ని సినిమాలు సక్సెస్ అవ్వలేదన్నాడు. త్వరలోనే అక్కినేని కుటుంబం నుంచి విజయవంతమైన సినిమాలు వస్తాయని.. కస్టడీ చిత్రంతోనే అది మొదలు అవుతుందనే నమ్మకంతోనే ఉన్నానని చైతూ(Naga Chaitanya) వెల్లడించాడు.
Read Also: పాన్ వరల్డ్ మూవీ ‘హనుమాన్’ విడుదల వాయిదా
Follow us on: Google News, Koo, Twitter