WTC ఫైనల్​లో ఛాన్స్ కొట్టేసిన మిస్టర్ 360 ప్లేయర్!

-

టీమిండియా మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) ఈ IPL మధ్యలో తిరిగి గాడిలో పడ్డాడు. గత నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో ఫాంలోకి వచ్చాడు. దీంతో అభిమానులతో పాటు బీసీసీఐ కూడా ఆనందంలో ఉంది. ఎందుకంటే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​లో సూర్య ఘోరంగా విఫలమయ్యాడు. వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్​ డక్​ అయ్యాడు. అలాగే IPL సీజన్​ ఆరంభ మ్యాచుల్లోనూ ఫెయిల్ అయ్యాడు. దీంతో సూర్య కెరీర్ ఏమవుతోందనని ఫ్యాన్స్ భయపడ్డారు. ఇలాంటి తరుణంలో ‘ఐ యామ్ బ్యాక్’ అంటూ బ్యాట్ తో అదరగొడుతున్నాడు.

- Advertisement -

దీంతో సూర్యను WTC ఫైనల్​ జట్టులో ఆడించాలని బీసీసీఐ(BCCI) భావిస్తోందని సమాచారం. గతేడాది టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన సూర్యకు పెద్దగా నిరూపించుకునే అవకాశం రాలేదు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ గాయపడడం సూర్యకు కలిసొచ్చింది. ఐపీఎల్ తో పాటు WTC ఫైనల్​ మ్యాచుకు రాహుల్ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ స్థానాన్ని సూర్య(Suryakumar Yadav)తో బలోపేతం చేయాలని బీసీసీఐ ఫిక్స్ అయిందట. అందుకే యూకే వీసా రెడీగా ఉంచుకోవాలని అతడికి చెప్పినట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: కోహ్లీ, గంభీర్‌ల మధ్య గొడవకు అసలు కారణం అదే!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...