సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సర్. .ఏ స్టేజో తెలుసా ..? ట‌్రీట్మెంట్ కు ఎక్క‌డికి వెళుతున్నారంటే

సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సర్. .ఏ స్టేజో తెలుసా ..? ట‌్రీట్మెంట్ కు ఎక్క‌డికి వెళుతున్నారంటే

0
162

బాలీవుడ్ హీరో సంజయ్‌ దత్ మంచి ఫాలోయింగ్ ఉన్న బీ టౌన్ హీరో, ఎన్నో క‌ష్ట న‌ష్టాలు ఓర్చి ఇప్పుడు ప్ర‌శాంత‌మైన జీవితం సాగిస్తున్న సంజయ్ దత్‌కు ఇటీవ‌ల అనారోగ్యంగా ఉంది అని ఆస్ప‌త్రికి వెళ్లారు.
సంజూ బాయ్ కు ఏమైంది అని అంద‌రూ కంగారు ప‌డ్డారు అయితే.

శ్వాస సమస్యతో బాధపడుతున్న ఈయన ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో చేరారు. రెండు రోజులపాటు ఆయ‌నను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. త‌ర్వాత ఆయ‌న ఇంటికి చేరుకున్నారు, దీంతో అభిమానులు హ్యాపీ ఫీల్ అయ్యారు.

కాని ఇప్పుడు మ‌రో వార్త వినాల్సి వ‌స్తోంది.సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సర్ సోకింది, అది కూడా 3 వ స్టేజ్ లో ఉందని బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం సంజయ్ దత్ యుఎస్‌లో ఈ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు వెళ్లబోతున్నట్లుగా బీ టౌన్ మీడియా తెలియ‌చేసింది, అయితే రిక‌వ‌రీ అయ్యే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది అంటున్నారు నిపుణులు.