యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక సినిమా ఆదిపురుష్(Adipurush). ఈ సినిమా జూన్ 16న శుక్రవారం గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రికార్డ్ స్థాయి థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) రాముడిగా నటించగా.. కృతి సనన్(Kriti Sanon) సీత పాత్రలో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు. జూన్ 16న వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. మొదటిరోజు ఏకంగా రూ.140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. రెండోరోజు కూడా ఈ సినిమా హవా చూపించింది. 2వ రోజు ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు ఈ మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో మొత్తంగా రెండ్రోజుల్లో ఆదిపురుష్(Adipurush) రూ.240 కోట్లు కొల్లగొట్టింది.
Adipurush | నెగిటివ్ టాక్‌లోనూ సత్తా చాటుతున్న ‘ఆదిపురుష్’!
-