హీరోయిన్ గా సీనియర్ నటి మేనకోడలు ఎంట్రీ..

0
104

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని ఇప్పటికే ఎన్నో సినిమాలు తనదైన శైలిలో నటించి సత్తా చాటుకుంది. కుటుంబ నేపథ్యంలో సాగే కథలను ఎంచుకొని మంచి గుర్తింపు సంపాదించుకుంది. కేవలం సినిమాలలోనే కాకుండా ప్రస్తుతం టీవీ షోలలో  కూడా పాల్గొంటుంది. ఇటీవలే శ్రీకాంత్ తనయుడు అయినా రోషన్ ను హీరోగా మనకు పరిచయం చేసాడు.

ప్రస్తుతం ఈ హీరో వరుస ఆఫర్ లతో ఫుల్ బిజిగా ఉన్నాడు. తాజాగా రవితేజ తనయుడు మహాదన్ ను కూడా  అనిల్ రావిపూడి దర్శకత్వంలో  హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ ఆమని మేనకోడలు హృతిక  సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. బాల నటిగా పలు సినిమాల్లో నటించి సత్తా చాటుకున్న ఆమని మేనకోడలు హృతిక ప్రస్తుతం హీరోయిన్ గా ఏ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకోనుందో చూడాలి మరి.

జీవీకే దర్శకత్వంలో అభిలాష్‌ భండారి హీరోగా తెరకెక్కుతున్న ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంలో కథానాయికగా హృతిక నటిస్తోంది. ఈ సందర్బంగా మూవీ టైటిల్ పోస్టర్ బుధవారం రిలీజ్ చేసిన సందర్బంగా డైరెక్టర్ మాట్లాడుతూ..లవ్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సినిమా రాబోతున్నట్లు చెప్పారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి తమ ఖాతాల్లో వేసుకుంటుందో లేదో చూడాలి మరి.