శివాజీరాజా పై నిప్పులు చెరిగిన శ్రీ రెడ్డి

శివాజీరాజా పై నిప్పులు చెరిగిన శ్రీ రెడ్డి

0
131

మా ప్రెసిడెంట్ శివాజీరాజా పై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది . గతకొంత కాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి తాజాగా శివాజీరాజా పై నిప్పులు చెరిగింది . తల్లిదండ్రులను సైతం చూడని శివాజీరాజా వృధాశ్రమం కట్టిస్తాడట ? అది వృద్దులకు అంటూ సెటైర్ వేసింది అంతేకాదు కడుపుమండి నేను నా ఆవేదన ని వెలిబుచ్చితే పెద్దలను కాపాడటానికి రాజీ ప్రయత్నాలు చేసుకోమని , డబ్బులు ఇప్పిస్తానని బ్రోకర్ మాటలు మాట్లాడాడని శివాజీరాజా పై సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి . శివాజీరాజా కు తోడుగా శ్రీకాంత్ కూడా ఉన్నాడని వాళ్లకు గోచి ఉందని ఇప్పుడు దరిద్రపు గతి పట్టిందని మా బిల్డింగ్ కోసం నిధుల సేకరణలో భారీ అవినీతికి పాల్పడ్డారని, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని బాంబ్ పేల్చింది శ్రీరెడ్డి .

అమెరికాలో వచ్చిన డబ్బులో కోటి రూపాయలు మాత్రమే మా ఫండ్ కోసం ఇచ్చారని మిగతా సొమ్ములు పంచుకుతిన్నారని ఆరోపిస్తోంది శ్రీరెడ్డి . మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో డబ్బు గోల్ మాల్ అయ్యిందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి అంతేకాదు అధ్యక్షుడు శివాజీరాజా ప్రధాన కార్యదర్శి నరేష్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది దాంతో నరేష్ శివాజీరాజా పై ఆరోపణలు చేస్తున్నాడు .