నెల్లూరులో వైసీపీకి భారీ షాక్

నెల్లూరులో వైసీపీకి భారీ షాక్

0
97

2019 ఎన్నికలు దగ్గర వస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి.రోజుకో మలుపుతో ఎవరికీ అంతుచిక్కని విధంగా ముందుకు సాగుతుంది ఏపీ రాజకీయం . ఎన్నికలు దగ్గర పడడం తో పార్టీ మారే నేతలు కూడా ఎక్కువైపోయారు . రాజకీయాల్లో ఎప్పుడెవరు ఏ పార్టీలో ఉంటారో.. ఎప్పుడు జంప్ అవుతారో చెప్పడం ఎవరి తరమూ కాదు. అవకాశాలు, అవసరాల చుట్టూ నేతలు తిరుగుతారన్నది జగమెరిగిన సత్యమే. ఒకరొచ్చి ఇద్దరిని సాగనంపే ఘటనలు తరుచూ చూస్తూనే ఉంటాం.ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ ఇదే జరుగుతోంది. ఇందులోనూ నెల్లూరు జిల్లా పేరు బాగా వినిపిస్తోంది. అధికార టీడీపీ నుంచి ఇటీవల ఓ సీనియర్ నేత వైసీపీలోకి వెళ్లడంతో.. వైసీపీ నుంచి ఓ రాజకీయ కుటుంబమే అధికార టీడీపీలోకి వచ్చేందుకు సంప్రదింపులు జరుపుతుందట. నిజంగానే ఆ కుటుంబం అధికార టీడీపీలోకి వెళ్తే మాత్రం అక్కడ వైసీపీకి పెద్ద దెబ్బేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాజకీయాలు రెండు పార్టీల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి . ఇటీవల ఆనం రాంనారాయణరెడ్డి విశాఖపర్యటనలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఆనం రాకను మేకపాటి కుటుంబం జీర్ణించుకోలేకపోతుందట. నిజానికి గతంలోనే ఈ విషయంలో మేకపాటి కుటుంబ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆనం వస్తే.. తాము వైసీపీ నుంచి తప్పుకుంటామని ప్రకటించింది. ఇప్పుడు అదే జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఆధిపత్యం చెలాయించిన మేకపాటి కుటుంబానికి ఆనం రాకతో మింగుడుపడడంలేదని పలువురు నాయకులు అంటున్నారు. ఎన్నికలు దగ్గర వస్తున్న నేపథ్యంలో