SS Rajamouli |నాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇప్పటికే నాని కెరీర్‌లో భారీ కలెక్షన్లు సాధించిన సినిమాగా దసరా నిలవగా.. ప్రస్తుతం వందకోట్లు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో దసరా సినిమాపై అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. రా నేచర్ తో కనిపించే రోల్స్, వైవిధ్యమైన పరిస్థితుల మధ్య శ్రీకాంత్ ఓదెల ఓ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుంచారు. నాని ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చూపించారు. కీర్తి సురేష్ తన పాత్రలో కేక్ వాక్ చేసినట్లే నటించింది. ఈ చిత్రంలో ప్రతి నటుడు పాత్ర గుర్తుండిపోయే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. దసరా(Dasara) టీం మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని రాజమౌళి(SS Rajamouli) పేర్కొన్నారు. కాగా, తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో రా అండ్ రస్టిక్ కథతో వచ్చిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యారు.
Read Also: ప్రియుడితో కలిసి శ్రీవారి సేవలో జాన్వీ కపూర్
Follow us on: Google News, Koo, Twitter