స్టార్ హీరో ధనుష్ ‘సార్’ మూవీ స్టార్ట్..షూటింగ్ ఎప్పటి నుండి అంటే?

0
118

తమిళ స్టార్ హీరో ధనుష్ నేరుగా చేస్తున్న తొలి తెలుగు సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్​లో సోమవారం పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.. ముఖ్య అతిథిగా హాజరై, క్లాప్ కొట్టారు. జనవరి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.

‘సార్’ టైటిల్​తో తీస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’లో రానాకు జోడీగా నటిస్తున్న సంయుక్త మేనన్.. ఈ సినిమా కోసం హీరోయిన్​గా ఎంపిక చేశారు. జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్, ఫార్చున్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల ‘అత్రంగి రే’ సినిమాతో ధనుష్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. అక్షయ్ కుమార్, సారా అలీఖాన్ కూడా నటించిన ఈ హిందీ సినిమా నేరుగా డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ అవుతుంది.

‘వైదిస్​ కొలవెరీ దీ’ అంటూ దేశాన్ని ఊపేసిన ధనుష్​.. తమిళంలో ఎన్నో హిట్​లు అందుకున్నాడు. బాలీవుడ్​లోనూ రాంఝానా సినిమాతో అదరగొట్టాడు. రఘువరన్ బిటెక్, వీఐపీ సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.