మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలు, రీల్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుందీ భామ. ఈ క్రమంలోనే సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఓ ఫొటో అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఇంతకీ ఏంటా ఫోటో అని ఆలోచిస్తున్నారా..
గర్భవతిగా ఉన్న ఫొటో షేర్ చేసింది. దీంతో అనుపమ ప్రెగ్నెంట్ కావడమేంటని ఆశ్చర్యపోతున్నారు ఫాలోవర్స్. అయితే ఆమె నిజంగా గర్భవతి కాలేదు. అది 2019లో వచ్చిన ‘మణియారయిలే అశోకన్’ అనే మలయాళ సినిమా షూటింగ్లో తీసుకున్నది. ఫొటోలో అనుపమతో పాటు ఆమె తండ్రి కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ ఫోటోను పంచుకుంది. కాగా, అనుపమ.. ప్రస్తుతం ’18పేజెస్’, ‘కార్తికేయ 2’, ‘హెలెన్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
మరోవైపు సాధారణంగా అనుపమ ఓ సినిమా కోసం రూ.50 లక్షల కన్నా తక్కువే తీసుకుంటుందట! అయితే రౌడీబాయ్స్ కోసం ఈ సారి రూ.50లక్షల పారితోషికం తీసుకుందని సమాచారం. ‘రౌడీబాయ్’తో ప్రేక్షకులను అలరించిన అనుపమ ఈ రేంజ్ లో పారితోషికం తీసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.