తారక్ చిన్న కొడుకు పేరు భలే ఉంది..

తారక్ చిన్న కొడుకు పేరు భలే ఉంది..

0
174

జూనియర్ ఎన్టీఆర్ తన చిన్న కుమారుడికి పేరు పెట్టాడు. తారక రాముడి పేరు కలిసి వచ్చేలా నందమూరి ఇంట్లో పుట్టిన పిల్లలకు పేర పెట్టడం ఆనవాయితీ అనే సంగతి తెలిసిందే. దాని ప్రకారమే పెద్ద కొడుక్కి అభయ్ రామ్ అని పేరు పెట్టిన తారక్.. తన రెండో కుమారుడికి భార్గవ రామ్ అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఎన్టీఆర్.. భార్య ప్రణతి, ఇద్దరు కుమారులతో తాను కలిసి దిగిన క్యూట్ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశాడు.

తాత నందమూరి తారక రామారావు.. ఎన్టీఆర్‌గా ప్రసిద్ధి చెందగా.. తారక్ జూనియర్ ఎన్టీఆర్‌గా మారాడు. భవిష్యత్తులో తారక్ పెద్ద కొడుకు NARగా, చిన్న కొడుకు NBRగా ఫేమస్ అవుతారేమో కదూ.

తారక్, లక్ష్మీ ప్రణతి దంపతులకు 2014లో అభయ్ రామ్ జన్మించగా.. జూన్ 14న రెండో బాబు జన్మించాడు. కుటుంబం పెద్దదవుతోంది. బాబు పుట్టాడని తారక్ సోషల్ మీడియా ద్వారా తనకు కొడుకు పుట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.