Byreddy Shabari – Pushpa 2 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ‘పుష్ప-2’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ‘పుష్ప-2’ సినిమాను సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో టికెట్ ధరల వ్యవహారం పుష్పరాజ్‌కు పెద్ద ఛాలెంజ్‌గా మారింది. ముంబై, ఢిల్లీలో ఒక్కో టికెట్ ధర రూ.3000 వరకు ధర పలుకుతూ ప్రేక్షకులను దూరం చేసుకుంటుంది.
కాగా ఆంధ్రలో సాధారణ ధరలే ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో టికెట్ ధరల పెంపు కోసం పుష్ప టీమ్ మల్లగుల్లాలు పడుతుంది. ఈ క్రమంలో పుష్ప-2ను ఉద్దేశించి టీడీపీ ఎంపీ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఎన్నికలకు ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ప్రస్తావన తీసుకొస్తూనే టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి(Byreddy Shabari).. కీలక పోస్ట్ పెట్టారు.
‘‘అల్లు అర్జున్(Allu Arjun).. ఎన్నికలకు ముందు మీరు నంద్యాలలో చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్‌ను మా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఎన్నికలకు ముందు నంద్యాల(Nandyala)లో మీరు ఎలాగైతే ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారో.. అదే విధంగా సినిమా రిలీజ్‌కు ముందు కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని కోరుకుంటున్నా. నంద్యాల వెళ్లాలనే మీ సెంటిమెంట్ మాకు బాగా పనిచేసి ఇప్పుడు మా సెంటిమెంట్‌గా మారింది. పుష్ప-2 కూడా పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్ సక్సెస్ అవ్వాలి’’ అంటూ శబరి ట్వీట్ చేశారు.
కాసేపటికే తన పోస్ట్‌ను ఎడిట్ చేసిన శబరి.. మరి కాసేపటికి తన పోస్ట్‌ను పూర్తిగా డిలీట్ చేసేశారు. కానీ అప్పటికే ఆ పోస్ట్ స్క్రీన్ షాట్‌లో నెట్టింట వైరల్ కావడం మొదలైపోయింది. కాగా ఈ పోస్ట్ ఎడిటెడ్ పోస్ట్ అని, టీడీపీ ఎంపీ శబరి అటువంటి పోస్ట్ ఏమీ పెట్టలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. నెగిటివ్ ప్రమోషన్స్‌లో భాగంగా బన్నీ ఫ్యాన్సే ఈ పని చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది.