Aaman Devgan | సంక్రాంతి పోరులో ‘ఆజాద్’.. బాలీవుడ్‌లోకి మరో హీరో అరంగేట్రం..

-

బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయడం కోసం మరో యువహీరో, హీరోయిన్‌లు సిద్ధమయ్యారు. బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగణ్(Ajay Devgn) మేనల్లుడు ఆమన్ దేవగన్(Aaman Devgan), రవీనా టాండన్ కుమార్తె రషా థడాని ప్రధాని పాత్రల్లో నటించిన తొలి సినిమా ‘ఆజాద్(Azaad)’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

- Advertisement -

హిస్టారికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతునన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచేందుకు సన్నద్దమవుతోంది. చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. జనవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

‘‘ఇది ఒక యోధుడి ప్రేమ కథ’’ అని పోస్టర్‌తో పాటు రాసుకొచ్చారు. ఈ సినిమాను హాల్దీఘాట్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు నిర్మాత రోనీ స్క్రూవాలా వెల్లడించారు. ఇందులో అజయ్ దేవగణ్, డయానా పెంటి(Diana Penty) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ యువ హీరో(Aaman Devgan), హీరోయిన్లు ఏమాత్రం సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Read Also: ఆహారం తీసుకున్నా నీరసం తగ్గట్లేదా.. కారణాలు ఇవే కావొచ్చు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘సర్‌’ను అడ్డుకునే వాళ్లు దేశద్రోహులే.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Alltimereport : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ...

కివీస్ గడ్డపై భారత్ సరికొత్త చరిత్ర

Alltimereport : న్యూజిలాండ్ గడ్డపై భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర...