ఆర్యన్ ఖాన్ కు బెయిల్..ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు

This is RGV's reaction to Shahrukh's son getting bail.

0
112

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ కేసులో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. దాదాపు మూడు వారాలకు పైగా జైల్లో గడిపిన తర్వాత ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరయింది.

ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. చాలా మంది ముకుల్ రోహత్గి వంటి అత్యంత ఖరీదైన లాయర్లను పెట్టుకోలేరని అందుకే అమాయకులైన ఎంతో మంది జైళ్లలోనే అండర్ ట్రయల్స్ గా మగ్గిపోతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకుముందు కూడా ఆర్జీవీ ట్విట్టర్ లో తండ్రి కంటే ముందుగానే ఆర్యన్ ఖాన్ ని మీడియా, ఎన్సీబీలు లాంచ్ చేసి అగ్రస్థానంలో నిలిచాయని వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత సమయంలో ఆర్యన్ ఖాన్ తన తండ్రి దగ్గరి కంటే కూడా జైల్లోనూ, ఎన్సీబీ వద్దే జీవితం గురించి ఎక్కువగా నేర్చుకున్నాడని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఒక సూపర్ స్టార్ కొడుకును సూపర్ డూపర్ స్టార్ గా చేసినందుకు ఎన్సీబీకి ధన్యవాదాలు చెబుతూనే నేను షారుఖ్ ఖాన్ కి నిజమైన అభిమానిని అంటూ జై ఎన్సీబీ అని ట్వీట్ చేశాడు.