సినీ ఇండస్ట్రీలో విషాదం..యంగ్ హీరో కన్నుమూత

0
119

చిత్రపరిశ్రమలో వరుస విషాదాలతో కనీసం కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా, వ్యక్తిగత కారణాల చేత మరణించగా..తాజాగా ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు స‌త్య మరణించడంతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘వ‌రం’ సినిమాతో మనకు పరిచయమైనా ఈ హీరోకు గురువారం సాయంత్రం ఆక‌స్మికంగా గుండెపోటు వచ్చింది.

దాంతో కుటుంబసభ్యులు ఆందోళనతో హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు చికిత్స చేస్తుండగా మరణించడంతో కుటుంబ సభ్యులు రోదనకు గురయ్యారు.  స‌త్యకు ఎనిమిదేళ్ళ కుమార్తె కూడా ఉంది. ఈయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.