ప్రభాస్ నటించిన ఆదిపురుష్(Adipurush) చిత్రంపై రోజురోజుకూ వివాదాలు పెరిగిపోతున్నాయి. ఒకరు రామాయణం కథనే మార్చారంటూ మండిపడుతుండగా.. మరికొందరు డైలాగ్స్ ఇష్టారీతిన రాసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) రావణాసురుడిగా నటించిన ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది అంటూ ప్రజలు నుంచి పాలకులు వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) కూడా స్పందించారు. ప్రజల విశ్వాసాలను దెబ్బ తియ్యడాని తాము అంగీకరించమని, అటువంటి చర్యలకు తాము ఎప్పుడు వ్యతిరేకమని తెలియజేశారు. ఇప్పటికే ఆదిపురుష్(Adipurush) చిత్ర యూనిట్ సినిమాలోని ఇబ్బందికరమైన డైలాగ్స్‌ను మారుస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దానిని అనురాగ్ ఠాకూర్ కూడా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also:
1. భారత నిఘా విభాగం ‘రా’ నూతన అధిపతిగా రవి సిన్హా
2. తమిళ హీరోలపై నిర్మాతలమండలి రెడ్ నోటీస్!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat