విశాల్ పై రెచ్చిపోయిన మాజీ లవర్..!!

విశాల్ పై రెచ్చిపోయిన మాజీ లవర్..!!

0
104

తమిళ నటుడు విశాల్, హీరోయిన్ వరలక్ష్మీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ మధ్య నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కి విశాల్ కి మధ్య గొడవలు జరిగినా.. వరలక్ష్మి తన స్నేహాన్ని వదులుకోలేదు. అంతేకాదు ఇద్దరి మధ్య ప్రేమ ఉందని పుకార్లు కూడా వచ్చాయి . కట్ చేస్తే మేమిద్దరం స్నేహితులం మాత్రమే అని చెప్పడమే కాకుండా విశాల్ అనీషా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు . ఇక గొడవ విషయానికి వస్తే.. నడిగర్ సంఘం ఎన్నికలు సమీపించాయి . ఈనెల 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరుగనున్నాయి దాంతో మరోసారి ప్రెసిడెంట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో విశాల్ ఇప్పటి నుండే ప్రచారం మొదలు పెట్టాడు.

శరత్ కుమార్ వర్గం నుండి ఎవరు పోటీ చేసే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సమయంలోనే శరత్ కుమార్ పై ఒక వీడియోను చేసి విశాల్ వదిలాడు. అందులో గతంలో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా శరత్ కుమార్ ఉన్న సమయంలో జరిగిన అక్రమాలను చూపించాడు విశాల్. విశాల్ విడుదల చేసిన వీడియోపై వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే వరలక్ష్మి కి నచ్చలేదు ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో శరత్ కుమార్ పోటీ చేయడం లేదు . మా నాన్న ని ఎందుకు విమర్శిస్తున్నావ్ ? అతడు పోటీ చేయడం లేదు కదా ! ఇప్పుడు నువ్ చేయాల్సింది నీ పదవీకాలంలో నువ్ చేసిన పనుల గురించి అంతేకాని పోటీలో లేని మా నాన్నని తిట్టడం కాదు . నువ్ దిగజారి పోయావ్ విశాల్ఈసారి నా ఓటు నీకు వేయను అంటూ విశాల్ పై నిప్పులు చెరిగింది .