నేను ఒక్కసారి అనుకుంటే టీడీపీ పని ఖతం – జగన్..!!

నేను ఒక్కసారి అనుకుంటే టీడీపీ పని ఖతం - జగన్..!!

0
82

సీఎం జగన్.. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా చంద్రబాబులా రాజకీయాలు చేస్తే.. ఇవాళ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సభలో కూర్చునే వారు కాదన్నారు. ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. తనతో టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను డోర్ తెరిస్తే.. చాలామంది రావడానికి రెడీగా ఉన్నారని అన్నారు. నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు.

సంతలో పశువుల్ని కొనుగోలు చేసినట్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను నాడు చంద్రబాబు కొనుగోలు చేశారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన నీచ రాజకీయాలను, అన్యాయాన్ని.. దేవుడు, ప్రజలు గనమించారని… ‘గూబ గుయ్’ మనేలా దేవుడు, ప్రజలు తీర్పు చెప్పారని జగన్ అన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలని చంద్రబాబు కొనుగోలు చేశారో.. అంతమంది మాత్రమే టీడీపీకి మిగిలారని చెప్పారు.