‘RRR’ ట్రైలర్​ రిలీజ్​ ఎప్పుడంటే?

When is the 'RRR' trailer released?

0
38
RRR Wins Best Original Song

అనుకోని పరిస్థితులతో వాయిదాపడిన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్..కొత్త రిలీజ్ తేదీ ఖరారు చేసుకుంది. డిసెంబరు 9న ఉదయం 10 గంటలకు థియేటర్లలోనే నేరుగా దీనిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను ట్వీట్ చేశారు.

ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య దాదాపు రూ.450 కోట్లతో నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానుందీ సినిమా.

ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ‘ఆర్ఆర్ఆర్’​ దర్శకుడు రాజమౌళి “యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అది ధర్మయుద్ధమైతే విజయం తథ్యం” అని సినిమాలోని డైలాగ్‌ చెప్పారు. మరి ఈ డైలాగ్‌ సినిమాలో ఎవరు ఎవరితో అన్నారో తెలియాలంటే చిత్ర రిలీజ్​ వరకు ఆగాల్సిందే.