అల్లు అర్జున్ ‘ఐకాన్ ‘ సినిమా ఉంటుందా? లేదా?

0
93

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి సినిమాలు చేస్తూ విశేష ప్రేక్షాదరణ సొంత చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవలే సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన ‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. పుష్పకి సీక్వెల్ గా పుష్ప పార్ట్-2 కూడా తీయడానికి చిత్రబృందం అన్ని సన్నాహాలు చేస్తూ బన్నీ ఫాన్స్ ను ఖుషి చేస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ నటించబోతున్న ఒక సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేసి ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ మొదట ఓ మై ఫ్రెండ్ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో MCA సినిమాతో మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

గతంలో ప్రకటించిన ఐకాన్ చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి సెట్స్ మీదకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు డైరెక్టర్ వేణు శ్రీరామ్. కానీ అల్లు అర్జున్ తో సినిమా తీయాలనుకున్నా ఎంతోమంది దర్శక నిర్మాతలకు సైతం ఎదురుచూపులే మిగిలాయి. మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమాకు ఒకే చెబుతాడో లేదో చూడాలి.