Odisha | ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సుల్లో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులు స్పాట్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఒడిశా(Odisha) సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన ట్రీట్‌మెంట్ అందించాలని ఆదేశించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also:
1. రామ్ గోపాల్ వర్మకు ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వార్నింగ్
2. పవన్ కల్యాణ్ మలికిపురం సభలో ఆసక్తికర సీన్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat