కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో 92 ఏళ్ల కురువృద్ధుడు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామనూరు శివశంకరప్ప వరుసగా నాలుగోసారి కూడా విజయం సాధించారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శివశంకరప్ప(Shivashankarappa) తాజా ఫలితాల్లోనూ గెలిచి ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచారు. 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన దావణగెరె మున్సిపల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1997లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ఇక 2004లో దావణగెరె ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2008, 2013, 2018 ఎన్నికల్లో దావణగెరె దక్షిణ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా విజయబావుటా ఎగరవేశారు. తాజాగా 2023 శాసనసభ ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించి శివశంకరప్ప(Shivashankarappa) రికార్డు నెలకొల్పారు. కాగా కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136స్థానాలతో తిరుగులేని విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Read Also: ఇవే ఫలితాలు అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయి: రాహుల్
Follow us on: Google News, Koo, Twitter