ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) జరిగిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో 278 మంది ప్రయాణికులు దుర్మరణం చెందగా.. వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా.. ఈ ప్రమాదంపై కాంగ్రెస్(Congress) స్పందించింది. రైల్ నెట్‌వర్క్ కార్యకలాపాల్లో నిరంతరం భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం చాలా ఉందని అభిప్రాయపడంది. ఈ ప్రమాదంపై లేవనెత్తదగిన సమంజసమైన ప్రశ్నలు అనేకం ఉన్నాయని తెలిపింది. కానీ, ఇది సమయం కాదని తెలిపింది. కాగా, ఇప్పటికే రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ(PM Modi) స్పందించారు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. అధికారులతో కలిసి ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం రైల్వే మంత్రితో మాట్లాడిన ఆయన బాధితులను అవసరమైన సాయమందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో(Odisha Train Accident) తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలయిన వారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని తెలిపారు.