Karnataka Elections |కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. బెంగళూరులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇతర పార్టీ నేతల సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలను నిషేధం విధిస్తామని హామీ ఇచ్చారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందరికీ అందజేస్తామని ప్రకటించారు. కుటుంబానికి చెందిన ప్రతి మహిళకు నెలకు రూ.2, వేలు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రెండేళ్లపాటు నెలకు రూ.3000, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.1500, కర్ణాటక ఆర్టీసీ బస్సులలో మహిళలందరికీ ఉచిత ప్రయాణం లాంటి హామీలను మేనిఫెస్టో లో పేర్కొన్నారు. డీప్ సీ ఫిషింగ్ కోసం ప్రతి సంవత్సరం 500 లీటర్ల పన్ను రహిత డీజిల్ అందజేస్తామని మరియు ఫిషింగ్ సెలవులో సముద్రపు మత్స్యకారులందరికీ లీన్ పీరియడ్ అలవెన్స్‌గా రూ.6,000 అందజేస్తామని హామీ ఇచ్చారు.
Karnataka Elections |వర్క్ ఆర్డర్ జారీ చేసిన 90 రోజుల్లోగా పనులు ప్రారంభించి, కాంట్రాక్టులో పేర్కొన్న గడువులోగా పనులు పూర్తి చేసి, కాంట్రాక్టు ఒప్పందం గడువులోగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు. రాత్రి విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు నెలకు రూ. 5000 ప్రత్యేక భత్యం, సంవత్సరానికి ఒక నెల అదనపు వేతనం అందించనున్నట్లు తెలిపారు. రైతులకు పాల సబ్సిడీని రూ.5 నుంచి రూ.7 కి పెంపు, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, లింగాయత్ వంటి ఇతర వర్గాల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా సీలింగ్, రిజర్వేషన్లను 50% నుంచి 75%కి పెంచుతామని మేనిఫేస్టోలో హామీ ఇచ్చారు. కాగా.. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. 13 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. మరి ఈ మేనిఫెస్టోకు ప్రజలు మద్దతిస్తారో లేదో చూడాలి.
Read Also: ప్రతి ఏడాది ఉచితంగా గ్యాస్ సిలిండర్లు.. బీజేపీ హామీలు
Follow us on: Google News, Koo, Twitter