మరో వారం రోజుల్లోనే కర్ణాటక(Karnataka)లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అధికారమే పరమావధిగా అన్ని పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని సంస్థలు ఓపినీయన్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేయగా.. తాజాగా ఇండియా టుడే-సీఓటర్ సర్వే కూడా కాంగ్రెస్(Congress) పార్టీదే విజయమని తన సర్వేలో వెల్లడించింది.
224 సీట్లు ఉన్న కర్ణాటక(Karnataka) ఎన్నికల్లో అధికార బీజేపీ కేవలం 74-86 స్థానాలు దక్కించుకుంటుందని తెలిపింది. 2018లో సాధించిన సీట్ల కంటే తక్కువ సీట్లు ఈసారి వస్తాయని పేర్కొంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 107-119 వరకు సీట్లను గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది. కుమారస్వామి జేడీఎస్ పార్టీ 23 నుంచి 35 స్థానాల్లో గెలవచ్చని సర్వేలో వెల్లడించింది. ఈ ఎన్నికల్లో నిరుద్యోగం సమస్య ముఖ్యభూమిక పోషించబోతుందని తమ సర్వేలో తేలినట్లు చెప్పింది.
Read Also:
ప్రజల దృష్టిని మరల్చడానికి వేసిన ప్లానే ఇది: టీడీపీ ఎంపీ
చీకోటి ప్రవీణ్‌ను దేశం నుంచి బహిష్కరించాలి
Follow us on: Google News, Koo, Twitter