Byelection | అసెంబ్లీ ఉపఎన్నిక వాయిదా.. మళ్ళీ అప్పుడే..

-

దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక(Byelection) జరగనుంది. ఈ నెల 13న ఈ స్థానాలన్నింటికి ఒకేసారి ఉపఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్(EC) నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. తాజాగా ఈ నిర్ణయంలో కీలక మార్పు చేస్తూ ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 14 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉపఎన్నికను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న ఉపఎన్నిక జరగడం లేదని, వాటిని కొన్ని వారాల పాటు వాయిదా వేస్తున్నామని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttar Pradesh) 9, పంజాబ్‌లో(Punjab) 4, కేరళ(Kerala)లో పాలక్కాడ్ స్థానికి ఈ ఉపఎన్నిక జరగాల్సి ఉంది.

- Advertisement -

ఈ స్థానాలకు 13న జరగాల్సిన ఉపఎన్నిక(Byelection)ను వాయిదా వేసి నవంబర్ 20 నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో పండగలు జరగనున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పండగ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు అభ్యర్థించడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయానికి వచ్చింది. కాగా ఈ 14 మినహా మిగిలిన స్థానాల్లో ఉపఎన్నిక ప్రక్రియ యథాతథంగా జరగనుందని ఈసీ తెలిపింది.

Read Also: రెండో పెళ్ళికి రెడీ అంటున్న స్టార్ డైరెక్టర్..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...