Pratibha Patil |భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త, కాంగ్రెస్ సీనియర్ నేత దేవిసింగ్ షేకావత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పూణెలోని కేఈఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం పూణెలో జరగనున్నాయి. దేవిసింగ్ షేకావత్, ప్రతిభా పాటిల్‌కు 1965 జులై 7న వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఓ కుమార్తె ఉన్నారు. షేకావత్ మరణం పట్ల మహారాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కాగా ప్రతిభా పాటిల్ భారత ప్రథమ మహిళా రాష్ట్రపతిగా పని చేసి రికార్డు నెలకొల్పారు. దేవీసింగ్ గతంలో ఎమ్మెల్యేగా, మేయర్‌గా పని చేశారు.
Pratibha Patil |మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇంట తీవ్ర విషాదం
-