Assam |అనుమానాస్పద కదలికను పసిగట్టిన పోలీస్.. ఏం పట్టుకున్నాడో తెలుసా?

-

Drugs worth RS 25cr Seized In Assam | అనుమానాస్పద కదలికను పసిగట్టిన ఓ పోలీస్ ఆఫీసర్ రూ.25 కోట్లు విలువచేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మణిపూర్‌లోని భారత్-మయన్మార్ సరిహద్దు వద్ద ఓ వ్యక్తి నుంచి రూ. 25 కోట్లు విలువచేసే మత్తు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు. తెంగ్నౌపాల్ జిల్లాలో రోజువారీ పెట్రోలింగ్‌లో భాగంగా మోరే టౌన్‌లో రాష్ట్ర పోలీసులు, అస్సాం రైఫిల్ బృందం కలిసి తనిఖీలు చేపట్టారు.

- Advertisement -

Assam |పైచాంగ్ వెంగ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తి వద్ద ‘వరల్డ్ ఈజ్ యువర్స్’ అనే టాబ్లెట్స్‌ను కనుగొన్నారు. వీటి బరువు 56 కిలోలు ఉంటుందని సీనియర్ అధికారి తెలిపారు. అతను పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకుని విచారించారు. అతని నివాసంలో తనిఖీలు చేయగా.. అతని వద్ద భారీగా మాదక ద్రవ్యం లభించిందని అధికారి వివరించారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ కోసం మోరే పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్టు సరిహద్దు పోలీసులు చెప్పారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...