New RAW Chief | భారత నిఘా విభాగం ‘రా’ నూతన అధిపతిగా రవి సిన్హా

-

New RAW Chief | భారత కీలక నిఘా విభాగం ‘రా'(రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) కొత్త అధిపతిగా 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా(Ravi Sinha) నియమితులయ్యారు. సిన్హా నియమకానికి కేంద్ర మంత్రుల కమిటీ ఆమోదం తెలిపడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్ గఢ్ క్యాడర్ కు చెందిన రవి సిన్హా గత ఏడు సంవత్సరాలుగా ‘రా’లోనే ఆపరేషనల్ వింగ్ చీఫ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. విదేశాల్లో గూఢచర్యం, నిఘా వ్యవహారాల్లో ఆయనకు మంచి దిట్టగా పేరుంది. ముఖ్యంగా ఆయన జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష తీవ్రవాదంపై పనిచేశారు. ఇప్పటివరకు ‘రా’ చీఫ్ గా వ్యవహరించిన సమంత్ కుమార్ గోయల్(Samant Kumar Goel) త్వరలో పదవీవిరమణ చేయనున్నారు. ఇప్పటికే ఆయన పదవీకాలం పలుమార్లు పొడిగించారు.

- Advertisement -
Read Also:
1. ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు: చంద్రబాబు
2. తమిళ హీరోలపై నిర్మాతలమండలి రెడ్ నోటీస్!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...