ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కర్ణాటక(Karnataka)లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు టికెట్లు ఆశించి, ఆ తర్వాత నిరాశ చెంది రోజుకో పార్టీ మారుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నుంచి అనేకమంది కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా కాంగ్రెస్‌కు మరో శుభవార్త వచ్చినట్లు తెలుస్తోంది. కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్ కోడలు, శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్(Shivarajkumar) సతీమణి గీతా శివరాజ్‌కుమార్ ఇవాళ (ఏప్రిల్28) మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. పీసీసీ అధినేత డీకే శివ కుమార్ ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సొరబ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తన సోదరుడు మధు బంగారప్ప తరఫున గీత శివరాజ్ కుమార్ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.