అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) పై పాకిస్తాన్ జెండా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రాముని భక్తులు ఆందోళన చెందారు. రామమందిరంపై పాకిస్తాన్ జెండా చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఫోటో షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని గడగ్ జిల్లాకి చెందిన ఓ వ్యక్తి అయోధ్య రామమందిరం పై పాకిస్తాన్ జెండా ఉన్నట్టు ఫేక్ ఇమేజ్ క్రియేట్ చేశాడు. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మందిరంపై ఇస్లామిక్ జెండాలు ఎగురుతున్నట్టు ఫోటో క్రియేట్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.
అయోధ్య బాల రాముడి ప్రతిష్టాపన రోజే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అతను రామ మందిరం(Ayodhya Ram Mandir)పై బాబ్రీ మసీదు అంటూ వివాదాస్పద పిక్స్ ఫేస్బుక్ లో పోస్ట్ చేయడంపై హిందూ అనుబంధ సంఘాలు సీరియస్ అయ్యాయి. వెంటనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన గజేంద్రగడ్ పోలీసులు మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసిన తాజుద్దీన్ దఫేదార్(Tajuddin Dafedar) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వెంటనే ఫేస్బుక్ నుండి ఆ ఫోటోలను డిలీట్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు.