కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం శ్రీరామనవమి సందర్భంగా బెంగాల్‌లోని హౌరాలో తలెత్తిన ఘర్షణలపై మమతా బెనర్జీ స్పందించారు. నెలరోజులుగా అల్లర్లకు బీజేపీ ప్రణాళికలు రూపొందించిందని మమతా ఆరోపించారు. అదానీ ఉదంతంపై విపక్షాల ప్రశ్నల దాడిని తప్పించుకునేందుకు కాషాయ పార్టీ అల్లర్ల కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తూ తాను నిరసనల్లో నిమగ్నమయ్యాయనని, అయితే రామనవమి వేడుకల్లో హింసకు తెగబడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని దీదీ హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరిస్తూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. హింసను ముందుగా ఎవరు ప్రేరేపించారనేది ప్రజలకు తెలుసునని అన్నారు.
Read Also: ప్రధాని సర్టిఫికేట్లతో నీకేం పని.. ఢిల్లీ సీఎంకు హైకోర్టు షాక్!
Follow us on: Google News, Koo, Twitter